వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి అయోధ్య రాముడి దర్శనం.. అయోధ్య ట్రస్టు వెల్లడి!

అయోధ్యలోని రామ జన్మభూమిలో రామాలయం పనులు శరవేగంగా సాగుతున్నాయని.. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి భక్తుల దర్శనాల కోసం సిద్ధమవుతుందని అయోధ్య ట్రస్టు తెలిపింది. ఆలయ నిర్మాణం అద్భుతంగా కొనసాగుతోందని.. ఎక్కడా ఇనుము వాడకుండా రాతితో నిర్మిస్తున్నామని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. అయోధ్య సమీపంలోని సుల్తాన్ పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

అందరినీ ఆహ్వానిస్తున్నా..
‘‘సుల్తాన్ పూర్ అయోధ్యకు సమీపంలోనే ఉంది. వచ్చే ఏడాది డిసెంబర్ లో శ్రీరాముడి దర్శనానికి రావాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. అయోధ్య రామాలయం నిర్మాణం శర వేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటి కల్లా దర్శనాలకు సిద్ధమవుతుంది..” అని చంపత్ రాయ్ పేర్కొన్నారు. అద్భుతమైన శైలిలో రామాలయ నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు.


Ram Temple
Ayodhya Ram Mandir
Ayodhya Temple Trust
National
India

More Telugu News